Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోమ్: రోమ్ ఓపెన్ మాస్టర్స్ టైటిల్‌ను పోలెండ్‌కు చెందిన 15వ సీడ్ ఇగా స్వైటెక్ చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో 19ఏళ్ల స్వైటెక్ 6-0, 6-0తో చెక్ రిపబ్లిక్కు చెందిన మాజీ నంబర్‌వన్, 9వ సీడ్ కరోలినా ప్లిస్కోవాను చిత్తు చేసింది. తొలి సెట్‌ను 20 నిమిషాల్లోనే చేజిక్కించుకున్న స్వైటెక్ రెండో సెట్‌ను 25 నిమిషాల్లోనే ముగించింది. ఒక్క పాయింట్ కూడా ప్రత్యర్ధికి ఇవ్వకుండా ఫైనల్లో టైటిల్‌ను నెగ్గడం టోర్నీ చరిత్రలోనే ఇదే ప్రథమం. టైటిల్‌ను నెగ్గే క్రమంలో స్వైటెక్ 5వ సీడ్ స్విటోలినాను సెమీస్‌లో ఓడించగా.. టాప్‌సీడ్ స్టెఫెన్స్(అమెరికా) రెండోరౌండ్లో ఓటమిపాలవ్వగా.. 2వ సీడ్ బార్టీ క్వార్టర్స్‌లో గాయంతో వైదొలగడంతో కోకా గాఫ్ సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో గాఫ్‌ను ఓడించి ప్లిస్కోవా ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.