Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: మన్హట్టన్లో జరుగుతున్న యూనివర్శిటీ బిగ్12 ఔట్డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన ్షిప్లో భారత్కు చెందిన హైజంపర్ తేజశ్విన్ శంకర్ స్వర్ణ పతకం సాధించాడు. శనివారం రాత్రి జరిగిన పోటీలో 2.28మీ. ఎత్తు హైజంప్ చేశాడు. కానీ 2018లో నెలకొల్పిన కెరీర్ బెస్ట్(2.29మీ.) మాత్రం అధిగమించలేకపోయాడు. ఇదే విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ వక్లహోమాస్కు చెందిన వెర్నన్ టర్నెర్(2.25మీ.), టెక్సాస్ టెక్ యూనివర్శిటీకి చెందిన జాక్వన్ హోగాన్(2.11మీ.) రజిత, కాంస్య పతకాలు గెల్చుకున్నారు. 2019 పోటీల్లోనూ శంకర్ స్వర్ణ పతకాన్ని సాధించగా.. గత ఏడాది కోవిడ్-19 కారణంగా పోటీలు జరగలేదు. 22ఏళ్ల శంకర్ 2017నుంచి కన్సాస్ స్టేట్ యూనివర్శిటీలో పర్స్యూ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ను చేస్తున్నాడు.