Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టీమిండియా మహిళల క్రికెట్జట్టు సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమౌతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరిలోనే ఆసీస్ టూర్‌కు బయల్దేరాల్సి ఉన్నా.. కరోనా వైరస్‌తో ఈ టూర్‌ను బిసిసిఐ అప్పట్లో వాయిదా వేసింది. ఈ సిరీస్‌లో భాగంగా మూడేసి టి20లు, వన్డేలు ఆస్ట్రేలియా మహిళలతో ఆడాల్సి ఉంది. నూతన కోచ్ రమేష్ పొవార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం టీమిండియా మహిళా జట్టు తొలిసారి విదేశీ పర్యటనకు బయల్దేరి టాప్ సీడ్ ఆస్ట్రేలియాతో పోటీకి వెళ్తోంది. సెప్టెంబర్‌లో పర్యటనకు ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే అంగీకారం తెలిపాయి. మహిళా జట్టులో ఎక్కువమంది ఈ ఏడాదిలో జరిగే బిగ్‌బాష్ లీగ్, ఇంగ్లండ్ వేదికగా జరిగే 100బాల్ టోర్నమెంట్లలో ఆడనున్నారు. అనంతరం న్యూజిలాండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్, ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌తో బిజీ.. బిజీ..గా ఉన్నారు.
తొలి డోస్ వేయించుకున్న కుల్దీప్
టీమిండియా స్పిన్నర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు కుల్దీప్ యాదవ్ కరోనా వైరస్ తొలి డోస్‌ను వేయించుకున్నాడు. తొలి డోస్ టీకాను వేయించుకుంటున్న ఫొటోను కుల్దీప్ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరాడు. ఇప్పటికే పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్‌బౌలర్ ఇషాంత్ శర్మ, బ్యాట్స్‌మెన్ పుజారా, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ తదితరులు టీకా మొదటి డోసు వేయించుకున్న సంగతి తెలిసిందే.