Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబారు: 2016లో ఇంగ్లండ్‌తో, 2017లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడిన రెండు టెస్టులు ఫిక్సింగ్ జరగలేదని అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. 2018లో దుబారు న్యూస్ ఛానల్ ఆల్-జజీరా 'క్రికెట్ మ్యాచ్ ఫిక్సెస్' అంటూ వరుస కథనాలు ప్రసారం చేసింది. 2016లో చెన్నై వేదికపై ఇంగ్లండ్‌జట్టు, 2017లో రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడిన మ్యాచ్‌లపై వరుస కథనాలు ప్రసారం చేసింది. బుకీ అనీల్ మున్నావర్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో ఫిక్సింగ్ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దీంతో స్పందించిన ఐసిసి అప్పట్లోనే ఐదుగురు సభ్యుల ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి దీనిని అప్పగించింది. తాజాగా ఐసిసి ఆ కథనాలన్నీ వాస్తవం కాదని, ఆ రెండు మ్యాచ్‌లు ఫిక్సింగ్‌కు గురికాలేదని పేర్కొంటూ ఆ వాదనలను కొట్టిపారేసింది.