Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్లు క్షేమంగా సిడ్నీకి చేరుకున్నారు. ఐపిఎల్ ఆడేందుకు భారత్‌కు విచ్చేసిన ఆస్ట్రేలియాకు చెందిన సుమారు 40మంది టోర్నీ వాయిదాతో రెండు వారాల అనంతరం స్వస్థలాలకు తిరిగి చేరుకున్నారు. మే 3న ఐపిఎల్ వాయిదా పడడంతో 6నుంచి వీరంతా మాల్దీవుల్లో ఉన్నారు. ఓ ప్రత్యేక విమానంలో వార్నర్, కమ్మిన్స్, స్మిత్, మ్యాక్స్‌వెల్‌తో పాటు సహాయ సిబ్బంది చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మైఖేల్ హస్సే కరోనానుంచి కోలుకోవడంతో చెన్నైనుంచి తిరుగుపయనమైనట్లు సమాచారం.
విండీస్ పర్యటనకు ఆసీస్ జట్టు ఇదే!
వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు వెళ్ళే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ) సోమవారం ప్రకటించారు. 23మందితో కూడిన ఆసీస్ బృందాన్ని ఆరోన్ ఫించ్ సారథ్యం వహించనున్నాడు. నలుగురు స్పిన్నర్లతోపాటు న్యూజిలాండ్‌తో టూర్‌కు దూరమైన స్మిత్, స్టార్క్, హేజిల్‌వుడ్, వార్నర్, కమిన్స్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. లబూషేన్‌కు సెలెక్షన్ కమిటీ మొండిచెయ్యి చూపింది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య వెస్టిండీస్‌తో జులై 10నుంచి సెయింట్ లూసియావేదికగా 5టి20లు, 3వన్డేల్లో ఆస్ట్రేలియా తలపడనుంది.
జట్టు: ఫించ్(కెప్టెన్), అగర్, బెహ్రెన్‌డార్ఫ్, క్యారీ, కమ్మిన్స్, హేజిల్‌వుడ్, హెన్రిక్స్, మిఛెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్, మెరిడిత్, ఫిలిప్పె, రిచర్డుసన్, కేన్ రిచర్డుసన్, తన్వీర్ సంగ్, షార్ట్, స్టివ్ స్మిత్, స్టార్క్, స్టోయినీస్, స్వెప్సన్, ఆండ్రూ టై, మాథ్యూ వేడ్, వార్నర్, జంపా.