Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో ఛెల్సియాపై గెలుపు
గోటెన్బర్గ్(స్వీడన్): యూరోపియన్ మహిళల ఛాంపియన్స్ లీగ్ విజేతగా బార్సిలోనా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో బార్సిలోనా 4-0 గోల్స్ తేడాతో ఛెల్సియాను చిత్తుచేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆట ప్రారంభమైన 32 సెకన్లలోనే తొలి గోల్ కొట్టిన బార్సిలోనా.. ఆ తర్వాత ప్రథమార్థం 36వ నిమిషంలో చెల్సియా క్రీడాకారిణి ఓన్ గోల్ చేయడంతో తొలి అర్థభాగానికే 2-0 ఆధిక్యతను సంపాదించింది. రెండో అర్ధభాగంలో మరో రెండు గోల్స్ కొట్టిన బార్సిలోనా ప్రత్యర్ధిజట్టుకు ఒక్క గోల్‌ను కూడా సమర్పించుకోలేదు. దీంతో యూరోపియన్ లీగ్‌లో టైటిల్ గెల్చిన తొలి స్పెయిన్ క్లబ్ జట్టుగా బార్సిలోనా నిలిచింది. ఏడుసార్లు ఛాంపియన్ లియోన్ చేతిలో 2019లో బార్సిలోనా 4-1 గోల్స్ తేడాతో పరాజయాన్ని చవిచూసినా.. రెండేళ్ల విరామం అనంతరం టైటిల్‌ను గెల్చుకోవడం గమనార్హం.