Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసహి షింబమ్ డైలీ కథనం
టోక్యో: ఒలింపిక్స్‌కు 80శాతానికి పైగా జపాన్ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్లు స్థానిక పత్రిక ఓ కథనంలో ప్రచురించింది. 'అసహి షింబమ్ డైలీ' జరిపిన వారాంతర సర్వేలో 43%మంది ఒలింపిక్స్‌ను పూర్తిగా రద్దు చేయాలని, 40%మంది వాయిదా వేయాలని తెలిపినట్లు సోమవారం పత్రికలో ప్రచురించింది. కేవలం 14%మంది మాత్రమే షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరగాలని కోరుకుంటున్నారని, 10వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా జరిపిన సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా జపాన్‌లోని చాలా రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి ఎమర్జెన్సీ కొనసాగుతుందని, వైరస్ నాల్గో వేవ్‌కూడా వచ్చే ప్రమాదముందని, ఒలింపిక్స్ జరిగితే కరోనా ఉధృతి మరింత పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారని తెలిపింది. ఇక సర్వేలో పాల్గొన్న 28%మందిలో.. 1,527మంది తమ అభిప్రాయాలను ఆన్లైన్లో తిరిగి పంపగా.. 3,191మంది ఫోన్లద్వారా తమ సమాచారాన్ని తెలిపారని పేర్కొంది. ఒకవేళ ఒలింపిక్స్ జరిగితే స్టేడియాల్లో ప్రేక్షకుల అనుమతికి 59%మంది వ్యతిరేకించగా.. 33శాతం మంది కొద్దిమంది అభిమానులకు అవకాశమిస్తే మంచిదని, కేవలం 3%మంది మాత్రమే పూర్తిగా అభిమానుల సమక్షంలో ఒలింపిక్స్ జరగాలని కోరుకున్నట్లు ప్రచురించింది. మరో స్థానిక పత్రిక కైడో న్యూస్ ఆదివారం ప్రచురించిన కథనంలో 59.7%మంది ఒలింపిక్స్ రద్దును కోరుకుంటున్నారని, మిగిలినవారంతా వాయిదావేయాలని తమ అభిప్రాయాలను తెలిపినట్లు పేర్కొంది.