Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మూడు ఒలంపిక్స్‌లో బ్యాడ్మింటన్ మ్యాచ్ అఫిషియల్‌గా పాల్గొన్న తెలుగు వ్యక్తి వేమూరి సుధాకర్(72) కరోనాతో పోరాడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లో స్థిరపడిన సుధాకర్ సిండికేట్ బ్యాంక్‌లో క్లర్కుగా జీవితాన్ని ఆరంభించి ఆతర్వాత బ్యాడ్మింటన్‌పై ఆసక్తితో అటు మళ్లారు. గత ఏడాది కరోనా బారినపడి కోలుకున్న సుధాకర్ సెకండ్ వేవ్‌లో రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నా కరోనా మృత్యువు కబళించింది. సుధాకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లకు అంతర్జాతీయ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించిన సుధాకర్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల బ్యాడ్మింటన్ అసోసయేషన్ ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు.