Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కోవిడ్ నుంచి కోలుకున్నాడు. దీంతో ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు సాహా అందుబాటులో ఉండనున్నాడు. ఐపిఎల్ సీజన్-14లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సాహా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. సూమారు మూడు వారాల పాటు ఢిల్లీలోని ఓ హాటల్లో క్వారంటైన్లో వున్న సాహా తికిగి ఇంటికి చేరుకున్నాడు. జూన్ 2న ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందు ముంబైలో టీమిండియా ఈ నెల 24 నుంచి కఠిన ఆంక్షల మధ్య బయో బబుల్‌లో ఉండనుంది. ఈ బయో బబుల్‌లో చేరడానికి ముందు సాహాకు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయనున్నారు. అందులో కూడా నెగిటివ్ వస్తే సాహా ఇంగ్లండ్ వెళ్లే ప్రత్యేక విమానం ఎక్కుతాడు.