Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టీమిండియా మహిళా క్రికెటర్ ప్రియ పూనియా తల్లి సరోజ్ పూనియా కరోనాతో మంగళవారం మరణించారు. జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న సరోజ్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూసినట్లు 24 ఏళ్ల పూనియా ట్విట్టర్లో తెలిపారు. 'మీరు నన్ను బలంగా ఎందుకు ఉండమన్నారో ఈరోజు గ్రహించాను. మీరు లేని లోటును భర్తీ చేయడానికి నాకు బలం అవసరం. మమ్మీ నిన్ను మిస్ అవుతున్నా! మీ జ్ఞాపకాలు ఎప్పుడూ మర్చిపోలేను, దయచేసి అందరూ కోవిడ్ నియమాలు పాటించండి, జాగ్రత్తలు తీసుకోండి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది' అని పునియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇటీవలే వేదా కృష్ణమూర్తి తల్లి, సోదరి కోవిడ్‌తో మరణించగా.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్ళే మహిళలజట్టు మే 19నుంచి ముంబయిలో క్వారంటైన్లో ఉండాల్సి ఉంది.