Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: ఐసిసి టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లో కోహ్లి సేనతో పోరు సవాలుతో కూడుకున్నదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. 'టెస్టు ఛాంపియన్షిప్ సరైన ఉద్దేశాన్ని మనం చూడగలిగాం. ఇది సుదీర్ఘ ఫార్మాట్‌పై ఆసక్తి పెంచింది. మనం డిక్లరేషన్లు చూశాం.. హోరాహోరీగా తలపడ్డ మ్యాచులూ వీక్షించాం. భారత్-ఆస్ట్రేలియా, న్యూజిలాండ్-పాకిస్తాన్ సిరీసులు ఇందుకు మంచి ఉదాహరణలు. ఫలితాల కోసం జట్లు ఎంతగానో శ్రమించాయి. మేం ఫైనల్ ఆడుతున్నందుకు ఆత్రుతగా ఉంది. ఇందులో గెలిస్తే మరింత బాగుంటుంది. టీమిండియాతో ఎప్పుడు తలపడ్డా కఠిన సవాళ్లు ఎదురవుతాయి. వారితో ఆడటం ఎప్పుడూ ఉత్కంఠకరంగానే ఉంటుంది' అని విలియమ్సన్ అన్నాడు. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్, భారత్ మధ్య టెస్టు ఛాంపియన్‌ఫిప్ ఫైనల్స్‌లో జరగనుండగా.. దీనికి ముందు న్యూజిలాండ్జట్టు ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల్లో తలపడనుంది.