Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: ముందస్తు బెయిల్ కోసం సుశీల్ కుమార్ దరఖాస్తు చేసుకున్న పిటిషన్‌కు ఢిల్లీకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో రెజ్లర్ సాగర్ రాణా హత్యకు సంబంధించి నిందితుల్లో ఒకడిగా ఉన్న సుశీల్ కుమార్ అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. అయితే కోర్టు తన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో అతను స్వయంగా లొంగిపోవాల్సిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా, వారిచ్చిన సమాచారం మేరకు హత్యలో సుశీల్ కుమార్ హస్తం కూడా ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో సుశీల్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆచూకీ తెలిపినవారికి లక్ష రూపాయలు సుశీల్ సహచరుడు అజరు ఆచూకీ తెలిపినవారికి కూడా రూ.50 వేలు బహుమతిగా అందిస్తామని బహుమతిగా తాజాగా పోలీసులు ప్రకటించారు.