Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికా క్రికెట్‌బోర్డు
కేప్‌టౌన్: ఏబి డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో తిరిగి ఆడేది లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మంగళవారం స్పష్టం చేసింది. ఓ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాక తిరిగి జాతీయ జట్టులో పునరాగమనం కోరినా... అది సాధ్యం కాదని బోర్డు పేర్కొంది. 'వన్స్ అండ్ ఫర్ ఆల్' అని ఆ దేశ క్రికెట్‌బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. డివిలియర్స్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో ఆడే విషయంపై ఇంతకుముందు ఒకసారి అతడితో చర్చించామని, అప్పుడు తన నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని కుండ బద్దలుకొట్టినట్లు డివిలియర్స్ తెలిపాడని దక్షిణాఫ్రికా బోర్డు తెలిపింది. ఏబీ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఇండియన్ ప్రిమియర్‌లీగ్(ఐపిఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోపాటు ఆయా దేశాల్లో నిర్వహించే లీగుల్లో ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున డివిలియర్స్ 114 టెస్టులు, 228 వన్డేలతోపాటు 78టి20లు ఆడాడు.