Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ 'బాల్ టాంపరింగ్'పై మాట మార్చాడు. అప్పటి సంఘటనకు సంబంధించి తనవద్ద కొత్త సమాచారం ఏదీ తనవద్ద లేదని తెలిపినట్లు సిడ్నీ హెరాల్డ్ పత్రిక ఓ కథనంలో ప్రచురించింది. 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా 'శాండ్ ప్యాపర్' సంఘటన తమ బౌలర్లు అందరికీ తెలుసని చెప్పి పెను దుమారం లేపిన సంగతి తెలిసిందే. దీంతో సిఏ అప్పటి ఉదంతంపై మరోసారి విచారణకు ఆదేశించింది. దీంతో కళ్లు తెరిచిన బెన్ క్రాఫ్ట్ ఆ వివాదాన్ని ఇంతటితో ముగించాలని, బాల్ టాంపరింగ్‌కు సంబంధించి కొత్త సమాచారం ఏదీ తనవద్ద లేదని చెప్పాడు.