Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ల జట్ల మధ్య జరిగే రెండేళ్లకోసారి జరిగే యాషెస్ సిరీస్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ ఏడాది యాషెస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ) ఆతిథ్యమివ్వ నుండడంతో పూర్తి షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ క్రికెట్బోర్డుతో చర్చించిన అనంతరం షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు సిఏ ప్రకటించింది. ఈసారి పురుషుల జట్టు షెడ్యూల్‌తో పాటు మహిళల జట్టు షెడ్యూల్ కూడా సిఏ రిలీజ్ చేసింది. ప్రతిసారి యాషెస్ సిరీస్ నవంబర్-డిసెంబర్లో జరగనుండగా.. ఈసారి టి20 ప్రపంచకప్ కారణంగా డిసెంబర్-జనవరిలో జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 8నుంచి జరిగే తొలిటెస్ట్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 2019లో ఇంగ్లండ్ వేదిక జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమానంగా నిలిచినా.. అంతకుముందు(2017-18లో) ఆసీస్ విజేతగా నిలవడంతో సంప్రదాయం ప్రకారం యాషెస్ ట్రోపీ కంగారూజట్టువద్దే ఉంది.
యాషెస్ సిరీస్...
తొలి టెస్టు : డిసెంబర్ 8-12(బ్రిస్సేన్)
రెండో టెస్టు(డే నైట్): డిసెంబర్ 16-20(అడిలైడ్)
మూడో టెస్టు(బాక్సింగ్ డే టెస్టు): డిసెంబర్ 26-30(మెల్బోర్న్)
నాల్గో టెస్టు : జనవరి 5-9(సిడ్నీ)
ఐదో టెస్టు : జనవరి 14-18(పెర్త్)
మహిళల యాషెస్...
ఏకైక టెస్ట్: జనవరి 27-30(కాన్బెర్రా)
టి20 సిరీస్...
తొలి : ఫిబ్రవరి 4(సిడ్నీ)
రెండో : ఫిబ్రవరి 6(సిడ్నీ)
మూడో : ఫిబ్రవరి 8(అడిలైడ్)
వన్డే సిరీస్..
తొలి : ఫిబ్రవరి 13(అడిలైడ్)
రెండో : ఫిబ్రవరి 16(మెల్బోర్న్)
మూడో : ఫిబ్రవరి 19(మెల్బోర్న్)