Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) సర్వసభ్య సమావేశం పర్చ్యు వల్గా 29న జరగనుందని సెక్రటరీ జే షా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ సమావేశంలో భారత క్రికెట్ జట్టు భవిష్య కార్యా చరణతోపాటు టి20 ప్రపంచ కప్, దేశవాళీ సీజన్లపై సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో టి20 ప్రపంచకప్ ప్రధాన ఎజెండా కానుందని, ఐసిసి ఈ విషయమై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని బిసిసిఐని కోరిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) అర్ధాంతరంగా వాయిదా పడడం, భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న దృష్ట్యా టి20 ప్రపంచకప్ నిర్వహణ, వేదిక మార్పు ప్రకటనకు బిసిసిఐపై ఐసిసి ఒత్తిడి తెస్తోంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వార్షిక జనరల్‌బాడీ సమావేశంలో ఈ ఏడాది రంజీట్రోఫీని రద్దు చేయగా.. మిగిలిన దేశవాళీ సీజన్‌పై చర్చ జరగాల్సి ఉంది.