Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్
కోల్‌కతా: ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లు ఆడేందుకు భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు బుధవారం దోహాకు బయల్దేరింది. సునీల్ ఛెత్రీ సారథ్యంలోని 28 సభ్యుల బృందానికి హెడ్ కోచ్‌గా ఇగోర్ స్టిమక్ బాధ్యతలు నిర్వర్తించనుండగా.. మిడ్‌ఫీల్డర్ మార్టిన్ తొలిసారి భారతజట్టులో చోటు సంపాదించుకున్నాడు. కతార్‌కు బయల్దేరడానికి రెండురోజుల ముందు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి జరిపిన ఆర్టీపిసిఆర్ టెస్ట్‌ల్లో అందరికీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చాయి. మే 15నుంచి ఆటగాళ్లంతా బయో బబుల్‌లో ఉండగా.. కోల్‌కతా వేదికగా ఈ నెలలో జరగాల్సిన శిక్షణ శిబిరం కరోనా వైరస్ కారణంగా రద్దయింది. ఇక ఖతార్‌కు వెళ్లిన అనంతరం అక్కడి నిబంధనల ప్రకారం మన జట్టు సభ్యులంతా క్వారంటైన్‌కు వెళ్లనున్నారని, అనంతరం దుబారులోనే భారతజట్టు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నట్లు కోచ్ తెలిపారు. గ్రూప్-ఇలో భారత్ ఖాతాలో ప్రస్తుతం 3పాయింట్లు ఉన్నాయి.
జూన్ 3 : ఇండియా × కతార్(రా.10.30)
జూన్ 7 : ఇండియా × బంగ్లాదేశ్(రా.7.30)
జూన్ 15: ఇండియా × ఆఫ్ఘనిస్తాన్(రా.7.30)
గోల్‌కీపర్లు: గుర్ప్రీత్ సింగ్ సంధూ, అమ్రిందర్, ధీరజ్ సింగ్
డిఫెండర్స్: ప్రీతమ్, రాహుల్, నరేందర్, ఛింగ్లెసన, సందేశ్ జింగాన్, ఆదిల్‌ఖాన్, ఆకాశ్ మిశ్రా, శుభాషిస్ బోస్.
మిడ్ఫీల్డర్స్: ఉదంతన, ఫెర్నాండెజ్, లిస్టన్, రోలిన్, మార్టిన్, అనిరుధ్ థాపా, ప్రణరు, సురేశ్, లాలెన్గ్మవారు, అబ్దుల్ సాహల్, యాసిర్, లలిన్జులా, బిపిన్‌సింగ్, ఆశిఖ్.
ఫార్వర్డ్స్: ఇషన్ పండిత, సునీల్ ఛెత్రీ, మన్వీర్సింగ్.