Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా వైరస్‌తో పోరాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టార్ స్రవంతి నాయుడుకు భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్‌రావు ఆపన్న హస్తం అందించారు. కష్టకాలంలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు కుటుంబానికి ఆయన గురువారం ఆర్థిక సాయం చేశారు. కరోనా వైరస్‌తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న స్రవంతి తల్లిదండ్రుల చికిత్స కోసం రూ. 2 లక్షలను జగన్మోహన్ రావు అందించారు. స్రవంతి పరిస్థితి తెలుసుకుని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రూ.6.77 లక్షలు, హెచ్‌సీఏ రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేసిన విషయం విదితమే.