Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యంగానే ఉన్నానన్న దిగ్గజం
చంఢగీడ్ : దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డాడు. కోవిడ్-19 పాజిటివ్‌గా వచ్చిన మిల్కాసింగ్ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని మిల్కాసింగ్ చెప్పాడు. ' బుధవారం జాగింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఎటువంటి లక్షణాలు కనిపించటం లేదు. నేను పూర్తిగా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నాను. ఎటువంటి ఆందోళన లేదు. తొలుత తేలికపాటి జ్వరం కనిపించింది. ఇప్పుడు అంతా బాగుంది. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా మీ ముందుకొస్తాను. టీకా అవసరం ఉందని తొలుత భావించలేదు. ఇప్పుడు కోలుకున్న అనంతరం వ్యాక్సిన్ తీసుకుంటాను. మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి' అని 1958, 1962 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత మిల్కా సింగ్ తెలిపాడు.