Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్
సౌథాంప్టన్ : తటస్థ వేదికల్లో సమరం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితం!. టెస్టు క్రికెట్లో తటస్థ వేదికలు క్రికెట్‌కు పూర్తిగా కొత్త. ప్రపంచ ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్స్ ఫైనల్స్ రూపంలో టెస్టు ఫార్మాట్లోనూ తటస్థ వేదికపై అత్యుత్తమ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్, న్యూజిలాండ్‌లు సౌథాంప్టన్ వేదికగా ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్స్ కోసం పోటీపడనున్నాయి. భారత్‌తో తటస్థ వేదికగా టెస్టు పోరు పట్ల ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్టు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల కోసం న్యూజిలాండ్ ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చేరుకుంది. క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ సెషన్లకు సిద్ధం కానుంది. 'విరామం అనంతరం జట్టులోకి రావటం గొప్ప అనుభూతి. జట్టులో ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌తో ఆడనుండటం సవాల్. ఒక్కో టెస్టునే తీసుకుని ఫోకస్ పెడతాం. తటస్థ వేదికపై భిన్నమైన ప్రత్యర్థితో ఆడనుండటం ఆసక్తిగా ఉంది. భారత్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్స్ దిశగా ఆసక్తిగా ఉన్నాం' అని వర్చువల్ మీడియా సమావేశంలో విలియమ్సన్ అన్నాడు.