Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక పర్యటనకు ఎన్సీఏ డైరెక్టర్
ముంబయి : జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్గా రానున్నాడు!. చరిత్రలో తొలిసారి భారత జట్టు ఏకకాలంలో రెండు సిరీస్లలో ఆడనుంది. విరాట్ కోహ్లి సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్తో టెస్టులు, న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్లో తలపడనుంది. మరోవైపు జులైలోనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆ జట్టుతో వన్డే, టీ20 సిరీస్లో తలపడనుంది. రెగ్యులర్ చీఫ్ కోచ్ రవిశాస్త్రి కోహ్లిసేనతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న యువ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచింగ్ సారథ్యం వహించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఎన్సీఏ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం ద్రవిడ్ భారత జట్టుతో ప్రయాణం చేయటం లేదు. శ్రీలంక పర్యటనకు త్వరలోనే భారత జట్టుకు ప్రకటించనున్నారు. హార్దిక్ పాండ్య, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్లు కెప్టెన్సీ రేసులో ఉన్నారు.