Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎం.ఎస్ ధోనికి దీపక్ చాహర్ కితాబు
ముంబయి : విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పోరాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా.. ద్వితీయ శ్రేణి భారత జట్టు శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. పేరుకే ద్వితీయ శ్రేణి జట్టు అయినా.. శ్రీలంక పర్యటనకు రెగ్యులర్ భారత క్రికెటర్లే వెళ్లనున్నారు. శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ అయ్యర్లు శ్రీలంకతో సిరీస్‌లో ఆడనున్నారు. సిరీస్ షెడ్యూల్ సహా భారత జట్టును త్వరలోనే ప్రకటించనున్నారు. కెప్టెన్సీ రేసులో ధావన్, పాండ్య, అయ్యర్లు పోటీపడుతున్నారు. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న పేస్ బృందంలో కీలకంగా మారనున్న దీపక్ చాహర్ కెప్టెన్సీ, పవర్ ప్లే బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' శ్రీలంకకు వెళ్లనున్న జట్టులో సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్. అతడికే కెప్టెన్సీ అప్పగించటం మేలు. జట్టులో కెప్టెన్‌కు గౌరవం ఉండాలి. సీనియర్ ఆటగాడు కెప్టెన్‌గా ఉంటే ఆటగాళ్లు గౌరవిస్తారు. శ్రీలంక పర్యటనకు ధావన్ కెప్టెన్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం' అని చాయర్ అన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో పవర్ ప్లే పేసర్‌గా విశేషంగా ఆకట్టుకున్న చాహర్ ఆ ఘనతను కెప్టెన్ ఎం.ఎస్ ధోనికి ఆపాదించాడు. ' ధోనీ కెప్టెన్సీలో ఆడాలని నా కల. మహి సారథ్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పవర్ ప్లేలోనే మూడు ఓవర్లు వేసిన పేసర్ చెన్నై సూపర్ కింగ్స్‌లో మరొకరు లేరు. ధోని నన్ను ఎప్పుడూ పవర్ ప్లే బౌలర్‌గానే చూసేవాడు. పవర్ ప్లే ఓవర్లలో ఎన్నో సార్లు ధోని చేత చివాట్లు తిన్నాను. జట్టులో ఎవరు పవర్‌ప్లే, మిడిల్, డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేస్తారనే విషయం ధోనికి బాగా తెలుసు. శ్రీలంక పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని దీపక్ చాహర్ అన్నాడు.