Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండోసారి ఎన్నికైన ఐఓసీ బాస్
న్యూఢిల్లీ : అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడిగా నరెందర్ బత్రా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో బెల్జియం హాకీ సంఘం అధ్యక్షుడు మార్క్ కొడ్రన్పై 63-61 ఓట్లతో నరెందర్ బత్రా విజయం సాధించారు. ' భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరెందర్ బత్రా అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు' అని సమాఖ్య ట్వీట్ చేసింది. బెల్జియం హాకీ సంఘం అధ్యక్షుడు బత్రాకు గట్టి పోటీనిచ్చారు. కోవిడ్-19 కారణంగా ఓ ఏడాది పదవి కాలం పొడిగింపు లభించిన నరెందర్ బత్రా.. రెండో పర్యాయంలో అధ్యక్షుడిగా మూడేండ్లు మాత్రమే కొనసాగనున్నాడు. 2024 వరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా నరెందర్ బత్రా కొనసాగనున్నారు.