Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ : ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఒలింపిక్ మెడలిస్ట్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మే 4న దేశ రాజధానిలో జరిగిన గొడవలో సుశీల్ కుమార్, అతని అనుచరులు కొట్టడటంతో సాగర్ రానా మృతి చెందిన సంగతి తెలిసిందే. సాగర్ రానా స్నేహితులు సోను, అమిత్ కుమార్‌లు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో సుశీల్ కుమార్ ఏ1, అతడి స్నేహితుడు అజరు ఏ2గా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుచరుల దాడిలో సాగర్ మృతితో సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు సైతం నిరాకరించింది. సుశీల్ కుమార్ ఆచూకి తెలిపిన వారికి రూ.లక్ష వరకు, అజరు ఆచూకి తెలిపిన వారికి రూ.50 వేలకు నజరాన సైతం ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఉత్తరాఖాండ్‌కు పారిపోయే ప్రయత్నంలో సుశీల్ కుమార్ మీరట్ టోల్‌ప్లాజా వద్ద దొరికిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. సుశీల్ కుమార్ ఎక్కడున్నాడనే విషయాన్ని తెలుసుకున్నారు. శనివారం పంజాబ్‌లో సుశీల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని.. ఢిల్లీకి తీసుకొచ్చి విచారించనున్నారు.