Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యతిరేకత కనిపిస్తున్నా.. క్రీడలు ఆగవు
- ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఉద్ఘాటన
న్యూఢిల్లీ : జపాన్ వైద్య రంగంపై విపరీత భారం, ఒత్తిడి. నూతన కోవిడ్ రకాలపై ప్రజల్లో ఆందోళన. విపత్కర పరిస్థితుల్లో విశ్వ క్రీడల నిర్వహణపై పెరుగుతున్న వ్యతిరేకత. ఇవేవీ పట్టించుకునే పరిస్థితుల్లో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ఉంది. అత్యయిక స్థితి పరిస్థితుల్లోనైనా ఒలింపిక్స్ జరుగుతాయని ఐఓసీ ఉపాధ్యక్షుడు వ్యాఖ్యానించిన మరుసటి రోజే.. ఐఓసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒలింపిక్స్ నిర్వహణపై జపాన్ ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా.. షెడ్యూల్ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని థామస్ బాచ్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) వర్చువల్ కాంగ్రెల్‌లో థామస్ బాచ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
' టోక్యో ఒలింపిక్స్‌కు అంతిమంగా ఫైనల్ కౌంట్‌డౌన్ మొదలైంది. కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో మానవాళికి బలమైన ఐక్యత, వైవిధ్యతతో కూడిన సందేశం పంపించాల్సిన అవసరం ఉంది. వెలుగు ఉందనే విషయం చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. క్రీడల్లో పాల్గొనే అందరి భద్రత అత్యంత కీలకం. జపాన్ సహచరులతో కలిసి ఐఓసీ మెగా ఈవెంట్‌ను సురక్షిత వాతావారణంలో నిర్వహిస్తుంది. ఒలింపిక్స్‌లో పాల్గొనే 70 శాతం మంది అథ్లెట్లు ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు. ముగ్గురు వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి ఐఓసీ ఆఫర్స్ అందుకుంది. 2020 ఒలింపిక్స్ నిర్వహణకు కొన్ని త్యాగాలు తప్పవు. అథ్లెట్లు అంతిమంగా తమ ఒలింపిక్స్ స్వప్నాన్ని సాకారం చేసుకోనున్నారు' అని థామస్ బాచ్ అన్నారు.