Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీమర్ల అనుకూల పిచ్‌పై పనేసర్
లండన్ : చారిత్రక తొలి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌కు కాస్త పైచేయి ఉండనుందని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వేదిక సౌథాంప్టన్‌లో పిచ్ పరిస్థితులు సీమర్లకు అనుకూలిస్తే భారత జట్టు ఇబ్బంది పడుతుందని పనేసర్ అన్నాడు. ' ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం వర్షాలు కురుస్తూ, చల్లదనంతో కూడిన వాతావరణం ఉంది. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆరంభం (జూన్ 18) నాటికి ఇవే పరిస్థితులు కొనసాగితే అప్పుడు కచ్చితంగా న్యూజిలాండ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. స్వింగ్ బంతిని భారత బ్యాట్స్‌మెన్ కంటే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మెరుగ్గా ఎదుర్కొంటారు. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో బంతి స్వింగ్ అయితే.. ఆ సవాల్‌కు భారత బ్యాట్స్‌మెన్ ఏ మేరకు నిలబడతారనేది ఆసక్తికరం' అని మాంటీ పనేసర్ అన్నాడు.