Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజీ షెడ్యూల్‌తో తప్పని వాయిదా
న్యూఢిల్లీ : ఆసియా కప్ 2023కు వాయిదా పడింది. 2020 ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా తొలుత ఏడాది వాయిదా పడిన సంగతి తెలి సిందే. ఆతిథ్య హక్కులను శ్రీలంకకు బదలీ చేసిన పాకిస్థాన్.. ద్వీపదేశంలో ఆసియాకప్ నిర్వహణపై దీమా వ్యక్తం చేసింది. ఆసియా ప్రధాన దేశాలు ఈ ఏడాది ఆఖరు వరకు బిజీ షెడ్యూల్లో ఉన్నాయి. 2022లో సైతం ఆసియా కప్ కోసం క్యాలెండర్ ఖాళీగా లేదు. దీంతో ఆసియా కప్‌ను 2023లో నిర్వహి స్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. 'ఆసియాకప్ నిర్వహణపై బోర్డు నిశితంగా పరిశీలించింది. వాయిదా ఒక్కటే మార్గంగా తోచింది. 2022లో ఆసియాకప్ ఇప్పటికే ఉండటంతో.. 2020 ఆసియాకప్‌ను 2023లో నిర్వహిస్తాం. 2023 ఆసియా కప్ తేదీలను సమయాను గుణంగా ప్రకటిస్తాం' అసి ఏసీఏ ఓ ప్రకటనలో తెలిపింది. చివరగా 2018లో ఆసియాకప్ జరిగింది. చివరి రెండు ఆసియా కప్‌లను భారత్ గెల్చుకుంది.