Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16,500 అభిమానులకు అనుమతి
లాసన్నె: ఛాంపియన్స్ లీగ్స్ ఫైనల్స్‌కు 16,500మంది అభిమానులను అనుమతివ్వనున్నట్లు యుఇఎఫ్ఏ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే వారికోసం టికెట్లను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్లు.. ఒక్కో టికెట్ ధరను 70 యూరోలనుంచి 600 యూరోలు ఉండనున్నట్లు పేర్కొంది. 2020 ఛాంపియన్స్ లీగ్ ఫైనల్స్ జరిగే పోర్చుగల్‌లో ఉన్న ఎస్టాడియో-డూ-గ్రాడో స్టేడియంలో మూడో వంతు అభిమానులకు మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఛెల్సియా-మాంచెస్టర్ సిటీల మధ్య శనివారం జరిగే యుఇఎఫ్ఏ ఫైనల్ పోటీకి ఇప్పటికే 6వేలమంది అభిమానులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఆ సంఖ్యను 16,500లకు పెంచుతూ యుఇఎఫ్ఏ నిర్ణయం తీసుకుంది.