Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ మూడో వారం నుంచి.. మూడో వారాల విండో
న్యూఢిల్లీ: వాయిదాపడ్డ ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్)ను తిరిగి సెప్టెంబర్ 18, 19నుంచి యుఏఇ వేదికగా ప్రారంభించేందుకు బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడు వారాల విండోతో షెడ్యూల్‌ను తయా రు చేస్తున్నట్లు బిసిసిఐ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. భారత్ వేదికగా జరిగే అక్టోబర్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు ఐపిఎల్‌ను ముగించేలా.. సెప్టెంబర్ 18(శనివారం), 19(ఆదివారం) ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు నుంచి ఐపిఎల్‌ను తిరిగి ప్రారంభించి, అక్టోబర్ 9 లేదా 10కల్లా ముగిసేలా బిసిసిఐ కసరత్తు ప్రారంభించిందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో వాయిదాపడ్డ ఐపిఎల్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లు జరిగితే షేర్హోల్డర్లు, ఫ్రాంచైజీ, బ్రాడ్‌కాస్టర్స్ లాభపడతారని బిసిసిఐ భావిస్తోందన్నారు. అలా జరగాలంటే ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను సెప్టెంబర్ 14కల్లా ముగిస్తే.. ఆ మరుసటి రోజే అభిమన్యు ఈశ్వరన్, హనుమ విహారి యుఏఇకి బయల్దేరి వెళ్లే అవకాశముందని ఆయన చెప్పారు. ఆటగాళ్లకు కరోనా సోకడంతో మే 4నుంచి నిరవధికంగా వాయిదాపడ్డ సంగతి తెలిసిందే.