Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుశీల్‌ను స్టేడియంకు తీసుకెళ్లిన పోలీసులు
న్యూఢిల్లీ: రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు క్రైమ్ సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా మంగళవారం చత్రసాల్ స్టేడియంకు తీసుకువెళ్లారు. యువ రెజర్ల్ సాగర్ హత్య కేసులో సుశీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో విచారణలో భాగంగా హత్య జరిగిన ప్రదేశం వద్దకు సుశీల్‌ను తీసుకువెళ్లిన పోలీసులు.. హత్య జరిగిన ప్రదేశంలో క్రైమ్ సీన్‌ను రీ కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకు? ఎలా? దాడి జరిగిందన్న కోణంలో అక్కడే విచారించారు. సోమ వారం కూడా ఈ కేసుకు సంబంధిం చిన సుశీల్‌ను నాలుగు గంటల పాటు క్రైం బ్రాంచ్ పోలీసులు విచారిం చారు. ప్రాపర్టీ వివాదం నేపథ్యంలో సహనం కోల్పోయిన సుశీల్.. యువ రెజ్లర్లపై దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సస్పెండ్ చేసిన రైల్వేశాఖ
ఒలింపియన్ సుశీల్ కుమార్‌పై డిపార్ట్మెంటల్ చర్యకు రైల్వే శాఖ సన్నాహాలు ప్రారంభించింది. సుశీల్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర రైల్వే సిపిఆర్ఓ దీపక్ కుమార్ ట్వీట్ ద్వారా మంగళవారం సమాచారమి చ్చారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు. సుశీల్ నార్త్ రైల్వేలో సీని యర్ కమర్షియల్ మేనేజర్‌గా నియ మితులై 2015నుండి ఢిల్లీ ప్రభుత్వంలో డిప్యుటేషన్లో ఉన్నారు. గత ఏడాది అతడి డిప్యుటేషన్ కాలాన్ని రైల్వే అధి కారులు పొడిగించారని, ఈ సంవ త్సరం కూడా పొడిగింపు కోసం దర ఖాస్తు చేసుకోగా.. దానిని తిరస్కరించింది.