Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరే టీమిండియా పురుష, మహిళా క్రికెటర్ల కఠిన క్వారంటైన్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. కెప్టెన్ కోహ్లి, పరిమిత ఓవర్ల ఉపసారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు అందరూ బయో బబుల్లోకి వెళ్లారని బిసిసిఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. అలాగే మహిళా క్రికెటర్లు తొలిసారి కఠిన క్వారంటైన్లోకి వెళ్ళారని, వీరందరూ 8రోజుల క్వారంటైన్లో ఉండనున్నారని పేర్కొంది.
ఇక ముంబయి విమానాశ్రయానికి సమీపంలోని గ్రాండ్ హయత్ హోటల్లో క్రికెటర్ల కోసం బిసిసిఐ ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేసింది. జూన్ 2న భారతజట్లు ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నాయి. క్వారంటైన్ కాలంలో వీరందరికీ మూడుసార్లు ఆర్టీపిసిఆర్ టెస్ట్లు జరపనున్నారు. జూన్ 16నుంచి భారత మహిళల జట్టు ఇంగ్లండ్తో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టి20లు ఆడనుంది.