Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం పొందుతోన్న జాబితాలో కోహ్లి రెండోస్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ అగ్రస్థానంలో ఉండగా.. కెప్టెన్‌గా కోహ్లీ.. రూట్ మధ్య కేవలం 22 లక్షల రూపాయల వ్యత్యాసం మాత్రమే ఉంది. భారత క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న కోహ్లికి బిసిసిఐ అతనికి గ్రేడ్ ఏ-ప్లస్ కాంట్రాక్ట్ ఇచ్చింది. దీంతో విరాట్‌కు బిసిసిఐ వార్షిక వేతనంగా రూ.7కోట్లను చెల్లిస్తోంది. జో రూట్ ఏడాదికి రూ.7.22కోట్లను ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి తీసుకుంటున్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథిగా వ్యవహరిస్తున్న కోహ్లీ ఒక సీజన్‌కు 17కోట్లను వేతనంగా పొందుతున్నాడు.
ఆయా జట్ల కెప్టెన్ల వార్షిక వేతనాలు..
జో రూట్(ఇంగ్లండ్) : 7.22కోట్లు
విరాట్ కోహ్లి(భారత్) : 7.00కోట్లు
టిమ్ పైన్(ఆస్ట్రేలియా) : 5.0కోట్లు
డీన్ ఎల్గర్(దక్షిణాఫ్రికా) : 3.20కోట్లు
విలియమ్సన్(న్యూజిలాండ్) : 1.77 కోట్లు
ఇయాన్ మోర్గాన్(ఇంగ్లండ్) : 1.75కోట్లు
పొలార్డ్(వెస్టిండీస్) : 1.73కోట్లు
బాబర్ ఆజామ్(పాకిస్తాన్) : 62లక్షలు
కరుణరత్నె(శ్రీలంక) : 51లక్షలు