Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గెడాన్స్క్ బార్లో ఘటన
గెడాన్స్క్ (పొలాండ్): యురోపా లీగ్ ఫైనల్. మాంచెస్టర్ యునైటెడ్ ఎఫ్సీ, విల్లారియల్ ఎఫ్సీలు ప్రతిష్టాత్మక టైటిల్ కోసం పోటీపడనున్నాయి. యురోపా లీగ్ టైటిల్ ఫైట్ చూసేందుకు మాంచెస్టర్ యునైటెడ్ ఎఫ్సీ అభిమానులు గెడాన్స్క్కు చేరుకున్నారు. సాకర్ సమరం చూసేందుకు వచ్చిన మాంచెస్టర్ యునైటెడ్ అభిమానులు ఉన్న గెడాన్స్క్ బార్పై కొంతమంది మాస్క్లు, నల్లని దుస్తులు ధరించి నినాదాలు చేస్తూ దాడి అనంతరం బయటకు వచ్చారు. బార్లో కూర్చీలను చిందరవందర చేశారు. దాడిలో ముగ్గురు మాంచెస్టర్ యునైటెడ్ ఎఫ్సీ అభిమానులు గాయపడ్డారు. అభిమానులపై దాడి అనంతరం వారిని ఆగంతకులు నిలుపు దోపిడి చేశారు. మాంచెస్టర్ యునైటెడ్ అభిమానులపై దాడికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. మాంచెస్టర్ యునైటెడ్ ఎఫ్సీ అభిమానులపై దాడికి ఖండిస్తూ ఎఫ్సీ, గెడాన్స్క్ సిటీ మేయర్ ప్రకటన విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం దాడి చేసిన వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.