Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెటర్ల సమర సన్నద్ధత
ముంబయి : ఇంగ్లాండ్ పర్యటనకు భారత క్రికెటర్లు ఫిట్నెస్ కసరత్తులు మొదలుపెట్టారు. ప్రస్తుతం భారత క్రికెటర్లు ముంబయిలో కఠిన క్వారంటైన్లో గడుపుతున్నా, ఫిట్నెస్ను మెరుగుపర్చుకునే ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. క్వారంటైన్‌ను బయటకొచ్చి ఇంగ్లాండ్‌లో కాలుమోపే సమయానికి ఉత్తమ ఫిట్నెస్ సాధించేందుకు జిమ్‌లో చెమటోడ్చుతున్నారు. సౌథాంప్టన్‌లో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడనుంది. క్వారంటైన్లో ఉన్న క్రికెటర్ల కసరత్తులతో కూడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాతో పంచుకుంది. శుభ్‌మన్ గిల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మలు కసరత్తులు చేస్తూ కనిపించారు.
ముంబయిలోనే నివాసం ఉంటున్న కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్లు రోహిత్ శర్మ, అజింక్య రహానె సహా చీఫ్ కోచ్ రవిశాస్త్రిలు మంగళవారమే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న జట్టు బయో బబుల్‌లో చేరిన సంగతి తెలిసిందే. జూన్ 18న ఆరంభమయ్యే ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్స్ కోసం భారత జట్టు జూన్ 2న ఇంగ్లాండ్‌కు బయల్దేరనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు భారత సీనియర్ సెలక్షన్ కమిటీ 20 మందితో కూడిన జంబో జట్టును ఎంపిక చేసింది. కెఎల్ రాహుల్, వృద్దిమాన్ సాహాలు ఫిట్నెస్ నిరూపించుకున్న అనంతరం జట్టుతో పాటు ఇంగ్లాండ్ విమానం ఎక్కనున్నారు.