Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల జట్టు మాజీ కోచ్ బిజు జార్జ్
న్యూఢిల్లీ : సుదీర్ఘ విరామం అనంతరం భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌తో మూడు ఫార్మాట్ల సవాల్‌కు సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్ పర్యటనలో మిథాలీ, హర్మన్సేనలు ఓ టెస్టు, మూడు వన్డేలు సహా మూడు టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన ఏడాది అనంతరం అమ్మాయిల జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పోటీపడింది. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ దారుణ పరాజయం చవిచూసింది. బలమైన ఇంగ్లాండ్‌పై విజయానికి భారత జట్టు మ్యాచ్ ప్రాక్టీస్‌ను కీలకంగా భావించాలని మహిళల జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ బిజు జార్జ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
' ఇటీవల భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికాకు వన్డే, టీ20 సిరీస్‌లను కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఓ సిరీస్ ఆడి భారత్‌కు వస్తే.. భారత్ ఎటువంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా సిరీస్‌లోకి అడుగుపెట్టింది. లాక్డౌన్, కరోనా ఉదృత వ్యాప్తి కారణంగా అవుట్‌డోర్‌లో ప్రాక్టీస్‌కు వీలు చిక్కలేదు. మ్యాచ్ ప్రాక్టీస్‌తో సిరీస్‌కు రావటం సఫారీలకు లాభించింది. భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తోంది. అక్కడ వీలైనన్ని మంచి ఫీల్డింగ్, మ్యాచ్ ప్రాక్టీస్ సెషన్లు కీలకం. పాకిస్థాన్ సహా ఇతర జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. అన్ని జట్లు సిరీస్‌లు ఆడుతున్నాయి. అయినప్పటికీ ఫీల్డింగ్, టెక్నిక్ పరంగా భారత జట్టు మిగతా జట్ల కంటే మెరుగైన స్థానంలో ఉంది. భారత మహిళల జట్టు పునాది బలంగా ఉంది. అమ్మాయిలు గొప్పగా ఆడుతున్నారు, ఫలితాలు రాబడుతున్నారు. చివరగా 2017లో అమ్మాయిలు ఇంగ్లాండ్‌కు వెళ్లారు. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ పరుగుల పొదుపులో, రనౌట్లు చేయటంలో, క్యాచులు అందుకోవటంలో గొప్ప ప్రదర్శన చేసింది. ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలి. ఓ బ్యాటర్‌కు సరైన ఫీల్డింగ్ కూర్పు ఉండాలి' అని బిజు జార్జ్ అన్నాడు.