Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో వర్గ వివాదం చివరకు ఇద్దరు మాజీ భారత టెస్టు క్రికెటర్ల మధ్య పోటీకి తెరతీసింది. 85వ వార్షిక సర్వ సభ్యసమావేశం రసాభాసగా ముగియగా.. అధ్యక్షుడు అజహరుద్దుదీన్, కార్యదర్శి ఆర్. విజయానంద్ తమ వర్గాలతో ఎవరికివారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. బీసీసీఐలో హెచ్‌సీఏ ప్రతినిధిగా మహ్మద్ అజహరుద్దీన్ తనను తాను ప్రకటించుకోగా.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌ను విజయానంద్ వర్గం ఎంపిక చేసింది. బీసీసీఐ ఎస్‌జీఎంలో రాష్ట్ర ప్రతినిధులు పాల్గొంటారు. దీంతో నేడు వర్చువల్‌గా జరిగే ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్‌లలో ఎవరు పాల్గొంటారనే ఉత్కంఠ హెచ్‌సీఏ వర్గాల్లో నెలకొంది. వర్చువల్ సమావేశంలో పాల్గొనేందుకు సంబంధించిన వివరాలతో కూడిన ఈమెయిల్‌ను బీసీసీఐ పంపుతుంది. అంతకముందే, ఎస్‌జీఎంకు హాజరయ్యే అర్హులు ఎవరనే విషయం బీసీసీఐ తేల్చుతుందా? అనేది ఆసక్తికరం. బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి ప్రాతినిథ్యం వహించిన వారు హెచ్‌సీఏలో పైచేయి సాధించే అవకాశం ఉండటంతో తాజా పరిణామం ఉత్కంఠ రేపుతోంది.