Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్కని టోక్యో ఒలింపిక్స్ బెర్త్
న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్ మాజీ నం.1 క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించటంలో విఫలమ య్యారు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే గడువు జూన్ 15గా ఖరారు చేయగా.. ఆ సమయంలోగా బ్యాడ్మింటన్‌లో ఎటువంటి అర్హత టోర్నీలు నిర్వహించటం లేదని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తెలిపింది. మహిళల సింగిల్స్‌లో 22వ ర్యాంక్‌లో ఉన్న సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో 20వ ర్యాంక్‌లో ఉన్న కిదాంబి శ్రీకాంత్‌లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. నిబంధనల ప్రకారం గడువు లోగా ర్యాంకింగ్స్‌లో టాప్-16లో నిలిచిన క్రీడాకారులు మాత్రమే ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంటారు. ర్యాంకింగ్స్‌లో టాప్-16కు ఆవల ఉన్న సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌లు నేరుగా బెర్త్ సాధించలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒలింపిక్స్ అర్హత నిబంధనల్లో సడలింపు, ఇతర వెసులుబాటు ఏమైనా లభిస్తే తప్పితే.. టోక్యో ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌లు పోటీపడలేరు. భారత్ నుంచి నలుగురు షట్లరు మాత్రమే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. మహిళల సింగిల్స్‌లో టాప్ షట్లర్ పి.వి సింధు, పురుషుల సింగిల్స్‌లో బి. సాయిప్రణీత్ సహా పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల నమోదుకు జులై 5 చివరి తేది. ఆ లోపు నిబంధనల్లో మార్పులు చేర్పుల కోసం సైనా, శ్రీకాంత్ ఎదురుచూడకతప్పదు!.