Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ కోసం బీసీసీఐ అభ్యర్థన
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌ను ముగించేందుకు బీసీసీఐ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. మిగిలిన 31 మ్యాచులను ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ విండోలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14న ఇంగ్లాండ్ పర్యటన నుంచి భారత్ యుఏఈకి రానుండగా.. సెప్టెంబర్ 19, 20న ఐపీఎల్ పున ప్రారంభం కానుంది. అయితే, అదే సమయంలోనే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)ను నిర్వహిస్తోంది. సీపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్లు ఐపీఎల్లో కీలక ఆటగాళ్లు. ఇంగ్లాండ్ క్రికెటర్ల ప్రాతినిథ్యం ప్రశ్నార్థకమైన నేపథ్యంలో.. వెస్టిండీస్ క్రికెటర్లు సైతం దూరమైతే ఐపీఎల్ కళ తప్పే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని దూరం చేసేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. సీపీఎల్ షెడ్యూల్‌ను ముందుకు జరపాలని, తద్వారా ఐపీఎల్‌కు ముందే సీపీఎల్‌ను పూర్తి చేయాలని విండీస్ బోర్డును బీసీసీఐ కోరుతోంది. 'వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో చర్చలు నడుస్తున్నాయి. ఐపీఎల్‌కు కొన్ని రోజుల ముందు సీపీఎల్ ముగిస్తే బయో బబుల్ బదిలీ సులభతరం అవుతుంది. మూడు రోజుల కచ్చితమైన క్వారంటైన్‌ను ముగించేందుకు ఇది ఉపయోగపడనుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.