Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో పోరాడి ఓడిన బాక్సర్
న్యూఢిల్లీ : ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరోకోమ్ మరో పతకం పట్టేసింది. దుబారు (యుఏఈ)లో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ రజత పతకం సాధించింది. కజకిస్థాన్‌కు చెందిన బాక్సర్తో ఐదు రౌండ్ల బౌట్లో మేరీకోమ్ 2-3తో పరాజయం పాలైంది. 38 ఏండ్ల మేరీకోమ్ తన కంటే 11 ఏండ్ల చిన్నదైన బాక్సర్ చేతిలో ఓటమి చెందింది. సెమీఫైనల్లో మంగోలియా బాక్సర్న 4-1తో చిత్తుగా ఓడించిన మేరీకోమ్.. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రజతం కైవసం చేసుకుంది. ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో సైతం మేరీకోమ్ గతంలో ఐదుసార్లు స్వర్ణ పతకాలు సాధించింది.