Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ సీజన్ అనంతరం విడుదలకు అవకాశం
- దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ కరోనా ఆర్థిక సాయం
న్యూఢిల్లీ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం శని వారం వర్చువల్‌గా జరిగింది. ఎస్‌జీఎంలో రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రతినిధులు దేశవాళీ క్రికెటర్లకు కరోనా సాయంపై బోర్డు ఆఫీస్ బేరర్లను ప్రశ్నించలేదు. దీంతో శనివారం నాటి ఎస్‌జీఎంలో దేశవాళీ క్రికెటర్లకు 2020 రంజీ సీజన్ నష్ట పరిహారం అంశం అపరిష్క్కతంగానే మిగిలిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా 2020 రంజీ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసింది. దేశవాళీ క్రికెటర్లకు ప్రధాన ఆదాయ వనరు రంజీ ట్రోఫీ మ్యాచ్ ఫీజులు. కరోనా కష్టకాలంలో అది కూడా లేకపోవటంతో యువ క్రికెటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో దేశవాళీ క్రికెటర్లకు నష్ట పరిహారం చెల్లిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలోనే ప్రకటించాడు. ' దేశవాళీ క్రికెటర్లకు నష్టపరిహారం చెల్లిస్తాం. ఈ నిర్ణయాన్ని గతంలో ఏజీఎంలోనే తీసుకున్నాం. ఈ సీజన్ ఆఖరు నాటికి, దేశవాళీ క్రికెటర్లకు చెల్లింపులు జరుపుతాం' అని గంగూలీ అన్నాడు. 'ప్రతి క్రికెటర్‌కు రంజీ సీజన్‌కు రూ.4.5 లక్షలు నష్టపరిహారం ఇవ్వనున్నాం. మహిళా క్రికెటర్లకు రూ. 2.5 లక్షల చొప్పున ఇవ్వనున్నాం. రాష్ట్ర రంజీ జట్టుకు 20 మందిని ఎంపిక చేయాలి. దేశవాళీ క్రికెటర్ల నష్ట పరిహారానికి రూ.50 కోట్లు అవసరం. ఇది బీసీసీఐకి పెద్ద విషయం కాదు' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌కు ప్రసారదారు రూ.1500 కోట్లు బీసీసీఐకి చెల్లించాల్సి ఉంది. సీజన్లో మిగిలిన 31 మ్యాచుల నిర్వహణ అనంతరం, ఆ సొమ్ము బీసీసీఐకి దక్కనుంది. అనంతరమే దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ ఆర్థిక సాయం అందనుంది.