Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వార్నర్‌కు కూతుళ్ల ఆత్మీయ స్వాగతం
సిడ్నీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోసం ఏప్రిల్‌లో భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లు సుమారు ఎనిమిది వారాల అనంతరం ఇండ్లకు చేరుకున్నారు. ఐపీఎల్ బయో బబుల్‌లో కరోనా కేసుల నమోదుతో ఐపీఎల్‌ను అర్థాంతరంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో కరోనా విజృంభణతో ఉపఖండ దేశంపై ఆస్ట్రేలియా ప్రయాణ ఆంక్షలు విధించింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు రెండు వారాల పాటు మాల్దీవులులో క్వారంటైన్లో గడిపారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది, వ్యాఖ్యాతల బృందం సోమవారం ఇండ్లకు చేరుకున్నారు. స్టార్ సీమర్ పాట్ కమిన్స్‌కు భార్య స్వాగతం పలుకగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డెవిడ్ వార్నర్‌కు తన కూతుళ్లు తమదైన స్టయిల్లో నాన్నకు ఆత్మీయ స్వాగతం అందించారు. కరోనా కాలంలో బబుల్, క్వారంటైన్‌లోనే అధిక సమయం గడుపుతున్న క్రికెటర్లు.. త్వరలోనే వెస్టిండీస్ పర్యటనకు ఆసీస్ జాతీయ జట్టుతో పాటు బయల్దేరనున్నారు.