Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెగెటివ్ రిపోర్టు, టీకా నిబంధనలకు అవకాశం
- అభిమానులకు ప్రవేశంపై నిర్వాహకుల ఆలోచన
టోక్యో : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర తరుణంలో ఒలింపిక్స్ నిర్వహణకు జపాన్ ప్రభుత్వం మొండి పట్టుదల ప్రదర్శించటంపై అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికు తున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో విదేశీ అభిమానులపై నిషేధం విధించిన నిర్వా హకులు.. జపాన్ అభిమానులను అనుమతిం చటంపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు జపాన్‌కు చెందిన ఓ పత్రిక వార్తా కథనం ప్రచురించింది. ఒలింపిక్స్ వీక్షిం చడానికి రావాలనుకునే అభిమానులు ఆ వారంలో కోవిడ్-19 నెగెటివ్ దృవపత్రం లేదా వ్యాక్సిన్ తీసుకున్నట్టు రిపోర్టు సమర్పిస్తే స్టేడియంలోకి అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోంది. కోవిడ్-19 నెగెటివ్ రిపోర్టు చూపించాలనే నిబంధ నపై సోషల్ మీడియాలో జపాన్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ ఆతిథ్యానికి ముందు జపాన్‌లో వైద్య సిబ్బంది కొరత ఏర్పడగా, వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.