Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నియామకం
కాన్బెర్రా : సుమారు ఏడాది పాటు తాత్కాలిక ముఖ్య కార్య నిర్వాహణ అధికారి (సీఈఓ)గా బాధ్యతలు నిర్వర్తించిన నిక్ హాక్లీని క్రికెట్ ఆస్ట్రేలియా పూర్తి స్థాయి సీఈఓగా నియమించింది. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో అప్పటి సీఈవో కెవిన్ రాబర్ట్‌పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా హాక్లీకి బాధ్యతలు అప్పగించింది. స్వదేశంలో భారత్ సిరీస్ సహా దేశవాళీ సీజన్‌ను విజయవంతంగా నిర్వహించటంలో నిక్ హాక్లీ ముఖ్య భూమిక వహించాడు. కరోనా మహమ్మారి సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయటమే కాదు విధుల్లో ఉన్న ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. ఫలితంగా కెవిన్ రాబర్ట్ పదవి కోల్పోయాడు. కష్టకాలంలో నిక్ హాక్లీ నిబద్ధతతో పని చేసి క్రికెట్ ఆస్ట్రేలియా ఆర్థిక సంక్షోభం కోరల్లోకి వెళ్లకుండా చూడగలిగాడు.