Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్, టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్యంపై చర్చలు
- ఈసీబీ, బీసీసీఐ అధికారుల కీలక భేటీ
ముంబయి: సెప్టెంబర్ మూడో వారంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ పున ప్రారంభం. అక్టోబర్‌లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం. వీటిలో ఐపీఎల్‌ను యుఏఈకి తరలించిన బీసీసీఐ.. టీ20 ప్రపంచకప్ కోసం యుఏఈని ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఉన్నతా ధికారుల బృందం దుబారుకు చేరుకుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా సారథ్యంలోని ఆఫీస్ బేరర్ల బృందం ప్రత్యేక విమానంలో సోమవారం దుబారుకు చేరుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం ఈ బృందంతో చేరనున్నాడు. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో బీసీసీఐ అధికారుల బృందం కీలక చర్చలు జరపనుంది.
బోర్డు కార్యదర్శి అరుణ్ కుమార్ ధుమాల్, సంయుక్త కార్యదర్శి జయేశ్ జార్జ్, బీసీసీఐ తాత్కాలిక సీఈఓ హేమంగ్ ఆమిన్, బీసీసీఐ జనరల్ మేనేజర్, టీ20 ప్రపంచకప్ టోర్నీమెంట్ డైరెక్టర్ ధీరజ్ మల్హోత్రాలు జై షాతో పాటు దుబారుకు వెళ్లారు. శనివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఐపీఎల్‌ను యుఏఈకి తరలిస్తున్నట్టు ప్రకటించిన బీసీసీఐ.. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్ 2021 సీజన్లో మరో 31 మ్యాచులు మిగిలాయి. ఇందులో 27 లీగ్ మ్యాచులు కాగా.. నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచులు ఉన్నాయి.
యుఏఈలో ఐపీఎల్ నిర్వహణకు తొలుత యుఏఈ ప్రభుత్వం నుంచి బోర్డుకు అను మతులు లభించాలి. దుబారు, అబుదాబి, షార్జా వేదికల్లో ఐపీఎల్ మ్యాచులు జరుగనున్నాయి. ఐపీఎల్‌కు భారత్ సహా వివిధ దేశాల నుంచి క్రికెటర్లు యుఏఈకి రానున్నారు. అక్కడ బయో సెక్యూర్ బబుల్ సృష్టి, క్రికెటర్ల క్వారంటైన్ నిబంధనలను ఈసీబీతో బీసీసీఐ చర్చించనుంది. బయో బబుల్‌లో అందరికీ వ్యాక్సినేషన్ నిబంధనతో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నిర్వహణకు యుఏఈ ప్రభుత్వం అనుమ తించింది. దీంతో ఐపీఎల్లో క్రికెటర్లు, ఇతర సిబ్బందికి సైతం టీకాలు ఇచ్చే అంశాన్ని ఈసీబీతో అధికారుల బృందం చర్చించనుంది.
ఐసీసీ భేటీ నేడు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు నేడు సమావేశం కానుంది. ఈ సమా వేశంలో ప్రధానంగా టీ20 ప్రపంచకప్‌పై చర్చించనున్నారు. భారత్‌లో కరోనా ఉదృతి కారణంగా ఐపీఎల్‌ను యుఏఈ కి తరలించారు. 16 జట్ల మెగా ఈవెంట్‌కు భారత్ సురక్షిత వేదిక కాదనే అభిప్రాయం ఎక్కువవుతోంది. ఆతిథ్య హక్కులు కలిగిన భారత్.. వేదికను తేల్చేందుకు మరో నెల రోజుల గడువు కోరిన సంగతి తెలిసిందే. ప్రత్యా మ్నాయ వేదికగా యుఏఈ ప్రతిపాదన ఉండటంతో.. జులై తొలి వారంలో తుది షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్లో 31 మ్యాచులు, ప్రపంచకప్‌లో 45 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వటంతో యుఏఈ పిచ్‌ల నాణ్యత, ఫిట్నెస్ తెరపైకి వస్తోంది. ఐసీసీ టోర్నీల్లో మ్యాచుల ఆతిథ్యంతో ఆతిథ్య బోర్డు భారీ ఆదాయం లభిస్తోంది. దీంతో టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ విశ్వప్రయత్నాలు చేస్తోంది.