Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్లో ఆడేందుకు ఎన్ఓసీ కష్టాలు
ఢాకా : బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మిగతా సీజన్లో ఆడే అవకాశం లేదు. కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 14ను అర్థాంతరంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ మూడో వారంలో ఐపీఎల్ 14ను పున ప్రారంభిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. యుఏఈ నగరాలు దుబారు, అబుదాబి, షార్జాలు ఐపీఎల్ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. బంగ్లాదేశ్ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్ కాంట్రాక్టులు కలిగిన షకిబ్ అల్ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్‌లకు బంగ్దాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) నిరాకరించనుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో బంగ్లాదేశ్ వైట్‌బాల్ సిరీస్‌లు ఆడనుంది. ' మా షెడ్యూల్ ప్రకారం షకిబ్, ముస్తాఫిజుర్‌కు ఎన్ఓసీ ఇవ్వటం అసాధ్యం. ఎటువంటి అవకాశం కనిపించటం లేదు. టీ20 ప్రపంచకప్ ముందు ప్రతి మ్యాచ్ కీలకమే. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ సైతం వన్డే సూపర్ లీగ్‌కు అత్యంత కీలకం' అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపాడు.