Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎల్సీ గాయంతో టాప్ షట్లర్ నిర్ణయం
న్యూఢిల్లీ : ప్రపంచ అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కరొలినా మారిన్ అభిమానులకు షాకిచ్చింది. జులై 23 నుంచి ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు స్పెయిన్ షట్లర్ దూరమైంది. ఈ మేరకు మంగళవారం కరొలినా మారిన్ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని మారిన్ ప్రకటించింది. మూడు సార్లు ప్రపంచ చాంపియన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరొలినా మారిన్ మెగా ఈవెంట్‌కు దూరం కావటం స్పెయిన్‌కు గట్టి దెబ్బే!. రియో ఒలింపిక్స్‌లో పి.వి సింధుపై విజయంతో పసిడి పతకం సాధించిన కరొలినా మారిన్.. ఏఎల్సీ గాయం తిరగబెట్టడంతోనే టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. 2019లో కరొలినా మారిన్ ఏఎల్సీ గాయానికి గురైంది. శస్త్రచికిత్స అనంతరం తిరిగి ఆ ఏడాది సెప్టెంబర్‌లో రాకెట్ పట్టింది. టోక్యో ఒలింపిక్స్ కోసం కరొలినా మారిన్ గత రెండు నెలలుగా కఠోర సాధన చేస్తోంది. ఒలింపిక్స్‌కు ముందు ఆడిన ఐదు ఫైనల్స్‌లో కరొలినా మారిన్ నాలుగు ఫైనల్స్‌లో విజయం సాధించటంతో.. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె టైటిల్ ఫేవరేట్. ప్రస్తుతం ఏఎల్సీ శస్త్రచికిత్సకు వెళ్లనున్న కరొలినా మారిన్ తిరిగి వచ్చే ఏడాది మాత్రమే షటిల్ కోర్టులోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.