Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ష్లె బార్టీ శుభారంభం
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ ( ఫ్రాన్స్ )
మహిళల టెన్నిస్ దిగ్గజం, అమెరికా స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఆల్‌టైమ్ రికార్డు 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సెరెనా విలియమ్స్ వరుస సెట్లలో విజయం సాధించింది, ఫ్రెంచ్ ఓపెన్‌లో నాల్గో టైటిల్ రేసును ఆశావహంగా మొదలెట్టింది. ఐరినా కామెలియ బెగుపై 7-6(8-6), 6-2తో సెరెనా విలియమ్స్ మెరుపు విజయం సాధించింది. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో గెల్చుకున్న సెరెనా విలియమ్స్.. రెండో సెట్‌ను సులువుగా సొంతం చేసుకుంది. ఐదు ఏస్‌లతో రెచ్చిపోయిన సెరెనా విలియమ్స్.. బలమైన సర్వ్‌లతో చెలరేగింది. సెరెనా ఐదు బ్రేక్ పాయింట్లు సాధించగా.. ఓ టైబ్రేకర్‌ను సొంతం చేసుకుంది. టాప్ సీడ్, మహిళల సింగిల్స్ టైటిల్ ఫేవరేట్ ఆష్లె బార్టీ (ఆస్ట్రేలియా) తొలి రౌండ్లో చెమటోడ్చింది. 6-4, 3-6, 6-2తో ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెర్నార్డ పెరాపై పైచేయి సాధించింది. బార్టీ ఐదు ఏస్‌లు సంధించగా.. పెరా ఐదు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడింది. బార్టీ ఐదు బ్రేక్ పాయింట్లు నెగ్గగా.. పెరా మూడుతో సరిపెట్టుకుంది. తొలి సెట్‌ను నెగ్గిన బార్టీ.. రెండో సెట్‌ను కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో సెట్లో తిరుగులేని ప్రదర్శన చేసింది. అమెరికన్ స్టార్, 13వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ సైతం తొలి రౌండ్లో శుభారంభం చేసింది. అనస్తాసియ సెవస్టోవపై 6-3, 6-3తో జెన్నిఫర్ బ్రాడీ అలవోక విజయం సాధించింది. అన్ లీ (అమెరికా) 6-0, 6-1 మార్గరిటను చిత్తుగా ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఐరినా బరాపై 7-6(7-5), 6-2తో అస్ట్ర శర్మ (ఆస్ట్రేలియా) గెలుపొందింది. మరియ సక్కరి 6-4, 6-1తో కటరినపై వరుస సెట్లలో సులువుగా నెగ్గింది. ఒసియాన బాబెల్ 6-2, 7-5తో ఎలినా స్విట్లోనా చేతిలో పరాజయం పాలైంది. క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 4-6, 2-6తో సహచర క్రీడాకారిణి బార్బరా చేతిలో చిత్తుగా ఓటమి చెందింది. చైనా అమ్మాయి వాంగ్ కియాంగ్ 2-6, 6-4, 7-5తో సు వీపై గెలుపొందింది.
పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ ఆండ్రీ రూబ్లెవ్ 3-6, 6-7(6-8), 6-4, 6-3, 4-6తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్‌పై ఐదు సెట్ల మహా పోరులో తలొగ్గాడు. రూబ్లెవ్‌పై 25 ఏస్‌లు సంధించిన జాన్ లెనార్డ్ మూడు బ్రేక్ పాయింట్లతో పాటు ఓ టైబ్రేకర్‌ను గెల్చుకుని రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఆండ్రియస్ సెప్పి 6-3, 7-6(10-8), 4-6, 6-4తో ఫెలిక్స్ ఆగర్‌పై విజయం సాధించాడు. 24వ సీడ్ ఆటగాడు జెన్సన్ బ్రూక్స్బైపై 6-3, 6-4, 6-4తో అస్లాన్ విజయం సాధించాడు.