Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యాచ్ ప్రాక్టీస్ లేమిపై విరాట్ కోహ్లి
ముంబయి : ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 18 నుంచి సౌథాంప్టన్‌లో జరుగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడుతున్న న్యూజిలాండ్ కీలక మ్యాచ్ ప్రాక్టీస్ లబ్ది పొందనుంది. గురువారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో లండన్ చేరుకోనున్న కోహ్లిసేన.. అక్కడ మూడు రోజుల హౌటల్ క్వారంటైన్ అనంతరం నెట్ ప్రాక్టీస్ సెషన్లకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కెప్టెన్ కోహ్లి, కోచ్ శాస్త్రిలు వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ' డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ముందు నాలుగు నెట్ ప్రాక్టీస్ సెషన్లు లభించినా మాకు ఎటువంటి సమస్యలు లేవు. ఇంగ్లాండ్‌లో జట్టుగా ఆడితే ఎటువంటి ఫలితాలు రాబట్టగలమో మాకు తెలుసు. ఇంగ్లాండ్‌లో ఆడటం ఇది తొలిసారి కాదు. అక్కడి పరిస్థితులు ఏమిటో మాకు తెలుసు. పరిస్థితులకు అలవాటు పడినా, సరైన మైండ్‌సెట్ లేకుండా బరిలోకి దిగితే తొలి బంతికే వికెట్ ఇచ్చుకుంటాం, వికెట్ పడగొట్టడం కష్టమని అనిపిస్తుంది. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం జట్టులోని అందరికీ తెలుసు' అని కోహ్లి అన్నాడు. దీర్ఘకాలంలో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను మూడు మ్యాచుల సిరీస్‌గా నిర్వహిస్తే బాగుంటుందని చీఫ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.