Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లి, సోదరి మరణంపై వేద కృష్ణమూర్తి
బెంగళూర్
కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. ఎంతో మంది ఆప్తులను కోల్పోతున్నారు. పిల్లలు అనాధలుగా మారుతున్నారు. కోవిడ్-19 విలయ తాండవం లెక్కలేనన్ని కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి కుటుంబంలో తొమ్మిది మంది కోవిడ్-19 వైరస్ బారిన పడ్డారు. రెండు వారాల వ్యవధిలో వేద కృష్ణమూర్తి తన తల్లి, సోదరిని కోల్పోయింది. వైరస్‌కు తల్లిని, తల్లిలాంటి సోదరిని కోల్పోయిన వేద కృష్ణమూర్తి మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తోంది. మానసిక ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన ఈ విపత్కర పరిస్థితుల్లో వేద కృష్ణమూర్తి తన ఆవేదనను, అనుభవాన్ని ఓ క్రీడా వెబ్‌సైట్‌తో పంచుకుంది.
' ఇప్పటికి ఎంతో మందికి కోవిడ్-19ను ధైర్యంగా ఎదుర్కొవటం తెలియదు. నా అనుభవాన్ని వారితో పంచుకునేందుకు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంటర్నెట్ పరిజ్ఞానం ద్వారా వైద్యం వద్దు. ప్రజలు కచ్చితంగా మెడికల్ ప్రొఫెషనల్స్‌ను సంప్రదించాలి. నేను ఎదుర్కొన్న పరిస్థితుల్లో.. ఇతరులు సరైన అడుగులు వేయాలి. మా కుటుంబానికి వైరస్ ఎలా సోకిందనేది ఇప్పటికీ మిస్టరీ. కుటుంబ సభ్యులతో పాటు బెంగళూర్‌లోని నా స్నేహితులు కోవిడ్ పాజిటివ్‌గా వచ్చారు. కానీ నాకు నెగెటివ్ వచ్చింది. అది అదృష్టమా, తరచుగా చేతులు శుభ్రం చేసుకునే అలవాటు కాపాడిందా అనేది తెలియదు. ఈ సమయంలో మానసిక ఆరోగ్యం అత్యంత కీలకం. మా పెద్ద అక్క చనిపోవడానికి ముందు, ఆమె విపరీతమైన వేధనకు గురైంది. మా అమ్మది కూడా అదే పరిస్థితి. ఆమె చనిపోవడానికి ముందు రోజు రాత్రి.. కుటుంబంలో పిల్లలు సహా అందరికీ వైరస్ సోకిందని తెలుసుకుంది. నాకు తెలిసి, అది అక్కపై తీవ్ర ప్రభావం చూపింది. మహమ్మారి బారిన పడిన కుటుం బాలను చూసి హృదయం కలిచివేస్తోంది. వైరస్‌తో కొన్ని కుటుంబాలే తుడిచిపెట్టుకు పోయావనే వార్తలు విన్నాను. దీంతో అమ్మ, అక్క మినహా మిగతా కుటుంబ సభ్యులు కోలుకున్నం దుకు సంతోషించాలని చిన్న అక్క సుధ, నాన్నకు చెబుతాను. మేమంతా ఈ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్ని స్తున్నాం. వాస్తవాన్ని అంగీకరించేం దుకు చూస్తున్నాం. కోవిడ్ కల్లోలాన్ని గతంలోనే వదిలేయాలని అనుకుంటు న్నాం. ఓ విధంగా, మా అమ్మ అదృష్టవంతురాలు. ఆమె చనిపోయే సమయంలో కుటుంబ సభ్యులు అందరూ అమ్మ దగ్గరే ఉన్నాం. కరోనా సోకిన వారికి ఇటువంటి అవకాశం ఉండనే ఉండదు. నా జీవితంలో మా అమ్మ, అక్కది ప్రధాన పాత్ర. నేనిప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి వారే కారణం. ' నువ్వు తొలుత భరతమాత కూతురువు, తర్వాతే నా కూతురువు' అని మా అమ్మ నాతో అంటుండేది. నేను సెంచరీ కొట్టినా, సున్నాకు అవుటైనా.. నేనే వాళ్ల అభిమాన క్రికెటర్. వయసుతో సంబంధం లేకుండా ఇంట్లో నన్ను ముద్దు చేసేవారు. మా అమ్మ చనిపోవడానికి రెండు రోజుల ముందు, మా అక్క గురించి ఆందోళన మొదలైంది. వరుసగా ఆరు రోజులుగా అక్క జ్వరంతో బాధపడింది. తొలుత అక్కకు కోవిడ్ నెగెటివ్ రాగా.. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంది. సీటీ స్కాన్‌లో కోవిడ్ న్యూమోనియా అని తేలటంతో హాస్పిటల్లో చేర్పించాం. బెంగళూర్‌లో నేను మా అన్న ఇంటి నుంచి బయటకు వచ్చి, హౌటల్‌కు మారాను. ఆ తర్వాత మా అన్న కుటుంబంలో అందరికీ పాజిటివ్ వచ్చింది. బెంగళూర్‌లో హాస్పిటల్ బెడ్ దొరకటం కష్టంగా ఉండటంతో అందరినీ మా అక్క ఊరు కాడూర్కు పంపించాం. ఆక్సిజన్ స్థాయిలు తగ్గుముఖం పట్టడంతో మా అక్కను కాడూర్ నుంచి చిక్మంగుళూర్కు పంపించారు. వైద్యానికి స్పందించిన అక్క.. తొలుత నాలుగు రోజులు కోలుకునే స్థితిలో కనిపించింది. చనిపోయిన రాత్రి కాస్త దగ్గు మాత్రమే ఉంది, పూర్తిగా కోలుకుంటుందనే అనుకున్నాం. మా అమ్మ మరణంతో మా అన్న కుప్పకూలి పోయాడు. మానసికంగా ఎంతో ప్రభావం పడింది. కోవిడ్‌తో అతడిని సైతం చిక్‌మంగళూర్ హాస్పిటల్లో చేర్పించాం. మా నాన్న సిటీ స్కాన్ నివేదిక సైతం ఆశాజనంగా రాలేదు. కుటుంబంలో నేను ఒక్కదానినే కోవిడ్ బారిన పడకుండా ఉన్నాను. అందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ, మిగతా వారికి సమాచారం చేరవేశాను. సమన్వయం చేసుకునేందుకు నాకు మానసికంగా ఎంతో శక్తి అవసరమైంది. వారికి అవసరమైనవి సమకూర్చుతూ, హాస్పిటల్లో పడకలు ఏర్పాటు చేస్తూ, డాక్లర్టను సంప్రదించాను. ఈ విపత్కర పరిస్థితుల్లో డాక్లర్లను సంప్రదించటం, సన్నిహితులను ఏ విధంగా చూసుకోవాలనే విషయాలపై స్నేహితులకు చెబుతున్నాను. విషాదం అనంతరం ఒంటరిగా ఉండకుండా, ఏదో పనిలో నిమగం అవుతున్నాను. మా నాన్న సినిమాలు చూస్తూ బిజీగా ఉండేలా చూశాను. అక్క కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఏడు నెలల వయసులో తండ్రిని కోల్పోయాడు, ఇప్పుడు తల్లిని కోల్పోయాడు. వాడి పరిస్థితి సైతం నా మాదిరిగానే ఉంది. నేను విధిని బలంగా నమ్ముతాను. మా అక్క ఆరోగ్యంగా ఇంటికి తిరిగొస్తుందనే విశ్వసించాను. ఆమె రాదు అని తెలిసి.. నేను ముక్కలయ్యాను. కుటుంబంలో అందరం ముక్కలైపోయాం. మా హృదయాలు పగిలిపోయాయి' అని వేద కృష్ణమూర్తి తన ఆవేదనను పంచుకుంది.
ఈ సమయంలో నాకు ఫోన్స్, మెసేజ్‌లు చేయనివారి పట్ల నాకు ఎటువంటి అసంతృప్తి లేదు. నేను ఎటువంటి స్థితిలో ఉన్నాననో విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించిన అందరికీ ధన్యవాదాలు. బీసీసీఐ కార్యదర్శి జై షా ఫోన్ చేశారు. ఆయన నుంచి ఫోన్ కాల్ నేను ఊహించలేదు. నా గురించి, కుటుం బం గురించి అడిగి తెలుసు కున్నారు. బెంగళూర్‌కు వచ్చినప్పుడు ఇంటికి వస్తానని చెప్పారు. నాకు సహాయం కోసం సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన సహా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతులేని విషాదంలో మునిగినా.. సోషల్ మీడియాలో నేను చేసే రీ ట్వీట్‌తో మరో కుటుంబానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో క్రీయా శీలంగా ఉంటున్నానని వేద తెలిపింది.