Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పురుషుల డబుల్స్ ఆడే ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారినపడ్డట్టు టోర్నీ నిర్వాహకులు గురువారం వెల్లడించారు. టాప్ సీడ్ క్రొయేషియాకు చెందిన నికోలా మెక్టిక్, మేట్ పావిక్‌లకు కరోనా సోకడంతో క్వారంటైన్‌కు తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే స్పెయిన్‌కు చెందిన మరో పురుషుల డబుల్స్ జోడి జామే మునార్, ఫెలిసియానో లోపెజ్‌లు మ్యాచ్‌కు ముందు అదృశ్యమయ్యారు. వీరిలోనూ కోవిడ్ లక్షణాలు కనిపించడంతో సమాచారమివ్వ కుండా అర్ధంతరంగా వైదొలగడంతో వీరి పేర్లను కూడా డ్రా నుంచి నిర్వాహకులు తొలగించారు. ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం తాజాగా అర్థరాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
గాయంతో బార్టీ దూరం
టాప్‌సీడ్, ఆస్ట్రేలియాకు చెందిన అస్ట్లే బార్టీ ఫ్రెంచ్ ఓపెన్ రెండోరౌండ్ మ్యాచ్ ఆడుతూ గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోటీలో బార్టీ గురువారం పోలెండ్‌కు చెందిన మెగ్దా లినెట్టెతో తలపడుతూ తొలిసెట్‌ను 1-6తో చేజార్చుకొని రెండోసెట్‌లోనూ 2-2తో సమంగా ఉన్న అనంతరం మోకాలి గాయం తిరగబెట్టింది. అనంతరం వైద్యులు పరీక్షించినా మ్యాచ్ ఆడే పరిస్థితి కనబడలేదు. దీంతో టోర్నమెంట్‌నుంచి వైదొలుగుతున్నట్లు బార్టీ తెలిపింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో బార్టీ మూడు సెట్ల హోరాహోరీ పోరులో గెలిచిన సంగతి తెలిసిందే.